తిరుమలలో ప్రారంభమైన టైం స్లాట్.. గంటన్నరలోనే శ్రీవారి దర్శనం(వీడియో)

సోమవారం, 18 డిశెంబరు 2017 (19:09 IST)

Lord Venkateswara

శ్రీవారి భక్తులు నమ్మలేని నిజమిది. టిటిడి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో భక్తులకు త్వరితగతిన దర్సనభాగ్యం లభించనుంది. ఇందుకోసం భక్తులు చేయాల్సింది ఏమిటంటే... వారు తిరుమలకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డును తీసుకొస్తే సరిపోతుంది. నడక దారిన గాని, లేకుంటే వాహనాల ద్వారా గాని, తిరుమలకు ఎలా వచ్చినాసరే ఆధార్ కార్డు ఉంటే చాలు గంటన్నరలోనే తిరుమల శ్రీవారి దర్సనభాగ్యం లభిస్తుంది.
 
సాధారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి వుండి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎప్పుడు దర్సనం లభిస్తుందో తెలియక కంపార్టుమెంట్లో వేచి ఉంటారు. అయితే ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఆధార్ కార్డు తీసుకెళ్ళిన వెంటనే టైం స్లాట్ ను కేటాయిస్తారు. ఆ సమయానికి కంపార్టుమెంట్‌కు వెళితే చాలు చాలా త్వరగా దర్శనం లభిస్తుంది. 
 
రద్దీ సమయాల్లో అయితే 4 గంటల సమయం పట్టొచ్చు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు జెఈఓ శ్రీనివాసురాజులు టైం స్లాట్ విధానాన్ని ప్రారంభించారు. టిటిడి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.దీనిపై మరింత చదవండి :  
Ttd Aadhar Tirumala Time Slot Tirumala Venkateswara Darshan

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఈ ఆలయానికి వెళితే వందేళ్ళ శని అయినా పోవాల్సిందే..

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. ...

news

తిరుమలలో టైమ్‌స్లాట్ విధానం.. 2 గంటల్లో దర్శనం.. ఆధార్ తప్పనిసరి

తిరుమల శ్రీవారి దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సిన అవసరం ఇక భక్తులకు ఉండబోదు. వైకుంఠం ...

news

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. ...

news

ధనుర్మాసంలో యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి... ఉత్తర ద్వారం నుంచి...

ధనుస్సంక్రమణం డిసెంబరు 16. ఈ సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్థేశితమైనది. ఆ ...