సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:50 IST)

అక్టోబరు 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తితిదే నిర్ణయం తీసుకున్నట్టు ఈవో జవహర్‌ రెడ్డి వెల్లడించారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 500 నుంచి 1000 మందికి స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతోపాటు త్వరలో ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదుకోసం టీటీడీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద సోమవారం రాత్రి తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల వారికి సైతం సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించడంతో భక్తులు భారీసంఖ్యలో రావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.