పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారి పెరిగిన భక్తుల రద్దీ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు

tirumala
pnr| Last Updated: ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:38 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్లలో బారులు తీరారు.
 
ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా, స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.94 కోట్లుగా లెక్కగట్టారు. దీనిపై మరింత చదవండి :