బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:36 IST)

తితిదే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలి : ఉద్యోగ సంఘాలు

కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విస్తరిస్తూ, విజృంభిస్తున్నది. అనేక కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నది. తిరుపతిలోనూ రోజు రోజుకూ కోవిడ్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు, పెన్షనర్లు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 మరికొంతమంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. 
 
మొదటి సారి కరోనా కాలంలో టీటీడీ యాజమాన్యం ఉద్యోగులకు భరోసా ఇచ్చిన విధంగానే సెకండ్ వేవ్ కరోనాలోనూ ఉద్యోగులకు అండగా ఉండాలని ఆశిస్తున్నాం.
 
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. వీరికి సేవలందించే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు  తీసుకోవాల్సిన అవసరంఉంది. తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా, ఉద్యోగుల రక్షణ దృష్టిలో ఉంచుకొని "వర్క్ ఫ్రంహోం" చేయగలిగిన వారికి ఇచ్చి, మిగిలిన వారికి 50:50 నిష్పత్తిలో విధులు కేటాయించాలని కోరుతున్నారు. 
 
అలాగే గతంలోలాగే టిటిడి ఉద్యోగులకు ప్రత్యేకంగా శ్రీనివాసం నందు "కోవిడ్ ఐసోలేషన్"సెంటర్‌ను ప్రారంభించాలని టిటిడి ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గంపల వెంకటరణారెడ్డి, గోల్కొండ వెంకటేశం, మేడికొండ ప్రసాదరావు, మల్లారపు నాగార్జున, జాటోత్ తదితరులు టిటిడి యాజమాన్యాన్ని కోరుతున్నరు.