1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (10:42 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోం

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా సేవా టిక్కెట్లను అందిస్తున్న తితిదే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేలా ప్రత్యేకమైన యాప్.
 
నిజంగా ఇది శ్రీవారి భక్తులకు శుభవార్తే. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తితిదే ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవారి యాప్ పేరుతో గదులు, టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. 
 
ఇప్పటికే ఈ యాప్‌ను తితిదే సిద్ధం చేసిందట. త్వరలో భక్తులకు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ.. తితిదే వసతి సముదాయాల చుట్టూ భక్తులు తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్ ద్వారా ఏది కావాలంటే అది దొరికే వీలుంది. అలాగే ఆన్‌లైన్‌‍లో 30 0రూపాయల టిక్కెట్ల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది.