Widgets Magazine

జాతీయ సాహస బాలల పురస్కారాలు అప్పుడే...

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు, తమ ప్రాణాలకు సైతం తెగించి నిస్వార్థంతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వము 'జాతీయ సాహస బాలల

republic day
ivr| Last Modified శుక్రవారం, 19 జనవరి 2018 (14:27 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు, తమ ప్రాణాలకు సైతం తెగించి నిస్వార్థంతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వము 'జాతీయ సాహస బాలల పురస్కారాల' (నేషనల్‌ బ్రేవరీ అవార్డ్స్‌) ను ప్రవేశపెట్టింది. ఈ అవార్డును ప్రతి ఏటా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు ప్రదానం చేస్తారు.
ఈ అవార్డులను పొందిన బాలలకు ఒక మెడల్‌నూ, సర్టిఫికేట్‌నూ, క్యాష్‌ అవార్డ్‌తో కలిపి ప్రదానం చేస్తారు. 'భారత్‌' అవార్డ్‌ గెలుపొందినవారికి గోల్డ్‌ మెడల్‌నూ, మిగిలిన ఇతర అవార్డులను పొందినవారికి సిల్వర్‌ మెడల్స్‌నూ అందిస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందినవారికి నగదుపురస్కారంతో పాటూ, వారి చదువు కోసం ప్రోత్సాహకాలను, ఉపకార వేతనాలనూ ప్రభుత్వం అందిస్తుంది.
సాహస బాలల అవార్డుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచీ, ప్రభుత్వ విభాగాలనుంచీ, పంచాయతీల నుంచీ, జిల్లాపరిషత్‌ల నుంచీ స్కూల్‌ అథారిటీస్‌ నుంచీ, బాలల సంక్షేమ మండలి నుంచీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారు. ఇందుకోసం 'ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌' (ఐసిసిడబ్ల్యు) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిష్పక్షపాతంతో వచ్చిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి అర్హులైనవారిని ఎంపిక చేస్తుంది.


దీనిపై మరింత చదవండి :