సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By ivr
Last Modified: సోమవారం, 19 డిశెంబరు 2016 (18:14 IST)

కేసీఆర్ 'మిషన్ భగీరథ 2015-2016' ఎంతవరకూ వచ్చింది?

దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. ఇంటింటికీ నీరందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం, ఉద్యమస్ఫూర్తితో కేవలం 9 నెలల అత్యల్ప వ్యవధిలోనే

దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. ఇంటింటికీ నీరందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం, ఉద్యమస్ఫూర్తితో కేవలం 9 నెలల అత్యల్ప వ్యవధిలోనే మిషన్ భగీరథ తొలిదశ పనులు పూర్తి చేసి తెలంగాణ సత్తా చాటి చెప్పింది. ఆ తర్వాత దాని ఫలాలు తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా అందిపుచ్చుకుంటున్నారు. 2015 డిసెంబరులో ఓ ఉద్యమంలా ప్రారంభమైన మిషన్ భగీరథ గురించి కొన్ని విషయాలు.
 
మిషన్ భగీరథ కింద గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. నియోజకవర్గంలో 6 మండలాల పరిధిలోని 243 హెబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని సుమారు 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. మొత్తం 969 కి.మీ విస్తీర్ణంలో 6 మండలాలను, 1 మున్సిపాలిటీని కవర్ చేస్తారు. నియోజకవర్గం లో 78 గ్రామీణ ప్రాంతాలు, 67 పట్టణ ప్రాంతాల్లో 3.35 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు లభించనుంది. 
 
గ్రామీణ ప్రాంత ప్రజలకు 100 ఎల్‌పీసీడీ, పట్టణ ప్రాంత ప్రజలకు 150 ఎల్‌పీసీడీ నీటిని సరఫరా చేస్తారు. ఈ పథకం అమలు చేయడం కోసం 417 విలేజ్ ట్యాంకులు, 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, ఒక గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను, 417 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 1402 కి.మీ పైప్‌లైన్ నెట్‌వర్క్ గల ఈ పథకానికి 479 కి.మీ ట్రాన్స్‌మిషన్ పైప్‌లైన్, 923 డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. 
 
ఈ ప్రాజెక్టు నిర్వహణకు 1.8 మెగావాట్ల విద్యుత్ వినియోగించేందుకు సబ్‌స్టేషన్లను సిద్ధపరిచారు. నీటిని హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పైప్ లైన్ నుంచి వెళ్లే గోదావరి జలాల నుంచి తీసుకుంటున్నారు. మొత్తం రూ.1029.06 కోట్లు ఖర్చు కాగల ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థ వ్యాప్కోస్ రూపకల్పన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ పథకాన్ని ప్రారంభించి సర్వే, డిజైన్,డీపీఆర్ రూపకల్పన చేసుకుంది.