శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By ivr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:38 IST)

కాస్త వెనక్కి... 8న DeMonetisation బాంబు పేల్చిన మోదీ... పాక్ ప్రశంసలు... మోదీ దారిలో ఆస్ట్రేలియా

ఈ ఏడాది ప్రజలకు అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఏదయినా ఉన్నదంటే అది నోట్ల రద్దు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నవంబరు 8న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్

ఈ ఏడాది ప్రజలకు అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఏదయినా ఉన్నదంటే అది నోట్ల రద్దు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నవంబరు 8న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఒకింత షాక్ తిన్నారు. నల్ల కుబేరులైతే నిద్రలేని రాత్రులనే గడిపారు. ఇప్పటకీ నోట్ల రద్దు ప్రభావం దేశవ్యాప్తంగా అలానే ఉన్నది. ఇకపోతే నోట్ల రద్దును ఆస్ట్రేలియా ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ మార్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇక రూ.500, రూ. 1000 నోట్ల రద్దుపై పాకిస్థాన్‌ మీడియా స్పందించింది. నకిలీ కరెన్సీ, నల్లధనంపై పోరాటమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారతదేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా మోడీపై ప్రశంసలు గుప్పించింది. నోట్ల రద్దుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గట్టి నిర్ణయం తీసుకున్నారని ఆకాశానికెత్తేసింది. 
 
పాకిస్థాన్‌లోని అనేక టీవీ ఛానళ్ళు దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. చర్చల్లో పాల్గొన్న ఆర్థిక నిపుణులు, మేధావులు మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. భేష్ అని ప్రశంసించారు. ఇంకా పాక్‌లో కూడా పెద్ద నోట్ల రద్దు చేపట్టాలని నవాజ్ షరీఫ్‌కు సర్కారుకు సలహా ఇచ్చారు.  
 
మరోవైపు ప్రధాని మోదీ అడుగుజాడల్లో పాకిస్థాన్ కూడా నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో... పాకిస్థాన్‌లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి, అక్రమాలు, నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సెనేటర్ ఉస్మాన్ సైఫుల్లాఖాన్ డిమాండ్ చేశారు.

ఇకపోతే నగదు చెల్లింపులు కాకుండా క్యాష్‌లెస్... డిజిటల్ చెల్లింపులు చేసేవారికి బహుమతులు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పింస్తోంది. మరి ఈ ప్రకటనల పట్ల ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాల్సిందే.