శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By Selvi
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (17:08 IST)

2016 సంవత్సరంలో వన్య ప్రాణులకు తీరని నష్టం.. 95 పులులు మరణించాయ్

వన్యప్రాణులకు తీరని నష్టం ఏర్పడింది. 2016వ సంవత్సరంలో 117 పులులు అంతరించాయని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. దేశంలోని పలు అడవుల్లో ఉన్న 95 పులులు మరణించాయని, ఇందులో 22

వన్యప్రాణులకు తీరని నష్టం ఏర్పడింది. 2016వ సంవత్సరంలో 117 పులులు అంతరించాయని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. దేశంలోని పలు అడవుల్లో ఉన్న 95 పులులు మరణించాయని, ఇందులో 22 పులి చర్మాలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. పులుల వేటను నిరోధించడంతోపాటు వన్యప్రాణులను పరిరక్షించేందుకు వీలుగా వన్యప్రాణిచట్టాలను సవరించి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని వన్యప్రాణి పరిరక్షణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
 
గత ఏడాది 70 పులులు మరణించగా పది పులి చర్మాలను స్వాధీనం చేసకున్నారు. దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో అత్యధికంగా 29 పులులు వేటగాళ్ల బారిన పడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలో 17, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 7 పులులు మరణించాయి. అసోం, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, కేరళ రాష్ట్రాల్లో కూడా పులులు మరణించాయి. 
 
వేటగాళ్లు, విషప్రయోగం, విద్యుత్ కంచెల వల్ల, ప్రమాదాల వల్ల పులులు మరణించాయని తేలింది. పులులు అంతరించిపోవడంతోపాటు వేటగాళ్ల బారిన పడుతుండటం వన్యప్రాణిప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.