పెళ్లి చేసుకున్నవారికి ప్రేమ చిట్కాలు...

love
chitra| Last Updated: శనివారం, 2 ఏప్రియల్ 2016 (12:38 IST)
ప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభూతి. పెళ్లి, ప్రేమకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని రచయితలు చమత్కరిస్తుంటారు. అయితే పెళ్లి తర్వాత కూడా జీవిత భాగస్వామితో తొలినాటి ప్రేమానుభూతులను నెమరు వేసుకునేందుకు, మళ్లీ అలనాటి అనుభూతులను పంచుకునేందుకు ఉపకరించే కొన్ని చిట్కాలు ఇదిగో మీ కోసం....

ప్రతి రోజూ మల్లెపూలు తెచ్చి మీ జీవిత భాగస్వామికి ప్రేమతో అందించండి. మీ శ్రీమతిని ఆకట్టుకునే బహుమతులు అంటే ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, చీరలు తదితరాల కోసం మీ పర్సులో పైకానికి కాస్త పని చెప్పాలి.

హృదయం ఆకారంలోని తలగడలకు మీ పడకగదిలో చోటు కల్పించండి. అలాగే తలగడలకు మీ పేర్లను ఎంబ్రాయిడరీ చేయించుకోండి. శృంగారభరిత భావనలు వెల్లివిరిసేందుకు అప్పుడప్పుడు తలగడలతో యుద్ధం చేసుకోండి. అలసిన వేళ ఒకరి ఒడిలో మరొకరు సేద తీరేవేళ పొంగిపొరలే అనిర్వచనీయ ప్రేమానుభూతులు కలకాలం గుర్తుండిపోతాయి.

మీ జీవిత భాగస్వామి ఆభరణాల పేటికలో కొత్త ఆభరణాన్ని ఉంచి, ఆమె ఎలా స్పందిస్తుందనే దానికై వేచి చూడండి. చేతి గడియారాన్ని బహుమతిగా ఇవ్వండి. గడియారానికి ఒక వ్యాఖ్యను జత చేయండి..."నీ సమక్షంలో కాలమే తెలియడం లేదు. నీ కోసం నా జీవిత కాలాన్ని సమర్పించుకుంటాను ప్రియా" ఇలా చేస్తే మీ జీవితం సుఖమయమవుతుంది.దీనిపై మరింత చదవండి :