ఒక్కసారి చుంబించి పత్తాలేడు... ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు... ఎందుకని?
ఇటీవలే కొత్తగా ఐటీ ఉద్యోగంలో చేరాను. ఓ యువకుడు నేనంటే పడి చస్తుండేవాడు. చాలా కాలం అతడికి నేను రెస్పాండ్ అవలేదు. కానీ అతడు నాకోసం అలా ఎదురుచూస్తుండటంతో నేను నవ్వాను. అంతే... మెల్లిగా అతడు కూడా నన్ను పలుకరించసాగాడు. అలా మా పరిచయం చాలా క్లోజ్‌గా మారిపోయింది.
ఓ రోజు అనుకోకుండా నా చేయి అతడికి తగిలింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు నా చేయిని పట్టుకున్నాడు. ఏమయిందో తెలియదు కానీ... ఇద్దరం కొద్దిసేపు గాఢ చుంబనాల్లో తేలిపోయాము. ఆ రోజు నేనతడ్ని విడిచిపెట్టలేకపోయాను. అతడు వెళ్లిపోయాడు. కానీ తిరిగి రాలేదు. ఆఫీసుకు కూడా రావడం లేదు. ఏంటని ఆరా తీస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడట. అతడు ఎందుకిలా చేశాడో అర్థం కావడంలేదు.
పరస్పరం ఇద్దరూ ఆకర్షణకు లోనై ముద్దుల వరకూ వెళ్లి గాఢ చుంబనాల్లో తేలిపోయారు. ఐతే ఇది జరిగాక అతడు పత్తా లేకుండా పారిపోయాడంటే అతడు ఏదో చిక్కుల్లో ఇరుక్కుని వుంటాడు లేదంటే మీరు పెళ్లి ప్రపోజ్ చేస్తారనే భయంతో వెళ్లిపోయి వుండవచ్చు. ఏదేమైనప్పటికీ మీకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయాడంటే... అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో?
ఏదేమైనప్పటికీ అంతగా ప్రేమించినవాడయితే విషయాన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈరోజుల్లో ఎంతటి విషయాన్నయినా జస్ట్ ఓ ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా తెలియజేయవచ్చు. ఇలా చెప్పకుండా పారిపోయినతడి గురించి తలుచుకుని మనసు పాడుచేసుకునే కంటే అతడిని మర్చిపోవడం మంచిది.