ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By chitra
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2016 (12:56 IST)

మహిళలతో జరజాగ్రత్త గురూ.. శృంగారమే జీవితం కాదు.. ప్రేమనే ఆశిస్తారు.. తెలుసుకోండి..!

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరగాలంటే.. సంబంధాలు ఎల్లప్పుడూ పదిలంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో చూద్దాం..! స్త్రీలను సంతోషపెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. వారితో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడితేనే చాలు అవే వారు ఎక్కువగా కోరుకుంటారు. వారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే చాలు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం. 
 
చాలామంది మగువలు తమ అందచందాల గురించి తెగ ఆలోచిస్తుంటారు. పురుషులతో పోలిస్తే కాలం గడిచేకొద్దీ ఆడవాళ్లలో ఎన్నో మార్పులు శారీరకంగా చోటుచేసుకోవడం సహజం. ఈ తరుణంలో వారిలో లేని పోని భయాందోళనలు చోటుచేసుకుంటాయి. తమలో ఆకర్షణ తగ్గడం వల్ల భర్త తమనుండి దూరమైపోతాడనే భయాందోళనలు పెరగడం సహజం. తమ భార్యల్లో ఎప్పుడైతే ఈ తరహా ఆలోచనలు రావడం మొదలైనట్లు భర్తలు గమనిస్తే వెంటనే వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. వారి పట్ల తమ ప్రేమ ఎప్పటికీ తగ్గదని నమ్మకం కలిగించాలి.
 
వివాహమై ఇన్నేళ్లు గడిచినా నీపై నాకు ప్రేమ తగ్గలేదు.. నీలో ఆకర్షణ తగ్గినా.. తగ్గకపోయినా అదినాకు ముఖ్యం కాదు.. నువ్వే నాకు ముఖ్యమని చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆమెను ప్రతీ చిన్నదానికి ఆహా ఓహో అని పొగడండి.. కానీ, ఆ పొగడ్తలను శృతి మించనీయవద్దు. వాటిని మగువలు సులువుగా కనిపెట్టేస్తారు. తమ భర్త అబద్దాలతో తనను మభ్యపెట్టాలనుకుంటున్నాడని వారు కనిపెడితే అసలుకే ముప్పు వచ్చేస్తుంది. 
 
పురుషులతో పోలిస్తే స్త్రీలకు శృంగారం మీద విభిన్నాభిప్రాయాలుంటాయి. సెక్సే జీవితం కాదని వారి అభిప్రాయం. శృంగారాన్ని మించినది భర్త ప్రేమ అని వారి అభిప్రాయం. వారికి చక్కని భావోద్వేగాలు కావాలి. చాలామంది పురుషులు పడక గదిలో తమ అవసరం తీరేవరకు తమ భార్యలతో సన్నిహితంగా ఉంటారు, పనైపోగానే ఇక తమను పట్టించుకోనట్లుంటారని మహిళలు చాలామంది ఆరోపిస్తుంటారు. పడక గది వెలుపల కూడా తమ భార్యను ప్రేమిస్తున్నట్లు తెలిసేలా పురుషులు ప్రవర్తించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. సో.. పురుషులు మహిళలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని.. అప్పుడే వారి నుంచి ప్రేమ, ఆప్యాయతలు లభిస్తాయని వారు చెప్తున్నారు.