సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:13 IST)

మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?

సాధారణంగా ప్రేమలో పడినప్పుడు ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ప్రతీ సంఘటన మరపురానిదిగానే అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అవి మరింత లోతుగా ప్రేమలో మునిగిపోయేలా చేస్తుంటాయి. అనుబంధాన్ని మరింత బలంగా చేసే అలాంటి కొన్ని జ్ఞాపకాలను ఇప్పుడు ఓసారి తలచి చూద్దాం..
 
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో బంధం మొదలైన రోజుల్లో రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. చుక్కల పందిరి కింద చుట్టూ ఉన్న పరిసరాలను లెక్కచేయకుండా అలా మాట్లాడడం జరుగుతుంటుంది. అలా అర్థరాత్రి వరకు మాట్లాడుకున్న పిచ్చాపాటీ కబుర్లే మీ బంధాన్ని దృఢంగా చేస్తాయి. మాట్లాడుకోవడం వలనే కదా ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది.
 
అలానే మీ మనసు బాగోలేదన్న విషయాన్ని మీరు ప్రేమించిన వ్యక్తి మీరు చెప్పకుండానే గుర్తిస్తారు. ఆ విషయాన్ని మిమ్మల్ని చూడకుండానే.. మీ మాటల ద్వారా తెలుసుకోగలుగుతారు. అంతేకాదు.. ఆ సమయంలో మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రపంచంలో మీకు తోడుగా ఎవరూ లేరని భావిస్తున్న తరుణంలో.. మీకు తోడుగా అతను నిలబడితే.. ప్రపంచాన్నే జయించిన భావన కలుగుతుంది. ఆ సమయంలో ఏ నాటికీ నేను ఒంటరి కానని మీకనిపించే ఉంటుంది. 
 
మీకు నచ్చినట్టుగా తనను తాను మలచుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు సప్తసముద్రాలు అడ్డు వచ్చినా సరే అతన్ని ఆ క్షణం చేరుకుని గట్టిగా కౌగిలించుకోవాలనుకున్న సమయం మీకు గుర్తుంటుంది. అతనే కాదు.. మీరు కూడా అతని కోసం మిమ్మల్ని మీరు మార్చుకునే ఉంటారు కదా.. అది మీకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తుంది.