నిజమైన 'ప్రేమ'కు అమ్మాయిలు దాసోహం!

chitra| Last Updated: బుధవారం, 20 ఏప్రియల్ 2016 (11:55 IST)
ప్రస్తుత హైటెక్ సమాజంలో యువతీ యువకుల మధ్య ప్రేమ సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ప్రేమికుల్లో నిజమైన ప్రేమను చూపించే వారు ఎంతమంది ఉంటారు. నిజమైన ప్రేమకు కొలబద్ద ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. అయితే మంచి అందమైన అమ్మాయిల ప్రేమను పొందడానికి యువకుల్లో ఉండాల్సింది సిన్సియారిటీ. ఇదే ఉన్నట్టయితే ఎంతటి తలబిగుసు అమ్మాయినైనా తన బుట్టలో వేసుకోవచ్చట.

అయితే తనకు భర్తగా వచ్చే వ్యక్తి నిజమైన ప్రేమను పంచగలిగే వాడుగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. ముఖ్యంగా శృంగారంలో మంచి సరసుడై ఉండాలని భావిస్తుంటారు. వీటితో పాటు మంచి ఉద్యోగం, ఆస్తి, అంతస్తు, గుణగణాలు, అందం ఇత్యాది అంశాలను కూడా పరిగణంలోకి తీసుకుంటారని తాజాగా జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వేలో పాల్గొన్న అమ్మాయిలను ప్రశ్నించగా నిజమైన ప్రమే ముందు.. అన్నీ బలాదూర్‌ అని తెలింది. తమ భర్త సంపన్నుడు కాకపోయినా ఫర్వాలేదు కానీ.. మంచి సరసుడై ఉండాలని పలువురు యువతులు నిక్కచ్చిగా చెప్పారు. అయితే 15 నుంచి 20 శాతం మంది అమ్మాయిలు మాత్రం తమ భర్తలు మంచి దేహదారుఢ్యం కలిగి అందంగా ఉండాలని కోరుకున్నారు.

అయితే.. ప్రపంచంలోని మహిళల కంటే భారతీయ మహిళకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ మహిళ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటపుడు నిజమైన ప్రేమకే పెద్దపీట వేస్తుందని ఆ సర్వే వెల్లడించింది. సో.. అబ్బాయిలూ.. మీరు ప్రేమించే అమ్మాయి పట్ల నిజమైన ప్రేమను చూపండి.. ప్రేమ విజేతగా నిలువండి.దీనిపై మరింత చదవండి :