Widgets Magazine

శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు... హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే...

శుక్రవారం, 6 జనవరి 2017 (20:25 IST)

Widgets Magazine
Haridasu

సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెలవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు చెంగు విడువరా.. కృష్ణా! నా చెంగు విడువరా.. అందముగా ఈ కథ వినరే రజతాచలసదనా.. అంటూ తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ శ్రీకృష్ణ లీలామృతగానాన్ని కీర్తిస్తూ గ్రామవీధుల్లో సంచరిస్తారు.పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ.. వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. 
 
ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు.
 
ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.
 
హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Haridasu Makara Sankranti 2017

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఇచ్చింది ఎందుకు గుర్తుండదు అల్లుడూ...

అల్లుడు: సంక్రాంతికి మీరు స్కూటర్ ఇచ్చారు గుర్తుందా? మామ: ఇచ్చింది ఎందుకు గుర్తుండదు ...

news

నడకదారి లడ్డూల అక్రమాలకు అడ్డుకట్ట పడింది... ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అత్యంత కష్టంగా ఓర్చి స్వామి నిలయానికి వచ్చే భక్తులకు ...

news

పదవి కోసం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు జెఈఓ వంతు..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు అలంకరించాలంటే ఎంతోమంది ముందుంటారు. అలాంటి పదవిని ...

news

శ్రీవారి సన్నిధిలో అడ్డగోలుగా వ్యాపారం...

రహస్యం లేని సమాజం కోసం ప్రజలు ముందుకు పోవాలని చట్టసభల్లో తీర్మానాలు చెబుతున్న ఈ తరుణంలో ...