Widgets Magazine

పశువుల ప్రాధాన్యత పండుగ ‘కనుమ’... ఈరోజున ఏం తినాలో తెలుసా?

శనివారం, 14 జనవరి 2017 (18:58 IST)

Widgets Magazine

కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి పసుపు రాసి, కుంకుమబొట్లు పెట్టి పూలమాలలు వేస్తారు. అలంకరణకు కుచ్చులు కడతారు. కొమ్ములకు వెండి కొప్పులు ధరింపచేసి ఆకులో అన్నం పెట్టి తినిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గోపూజతో పాటు పక్షి పూజ కూడా చేస్తారు. 
 
రైతులు సంక్రాంతికి ముందుసాగే కుప్పనూర్పిళ్ళ సందర్భంలో వరివెన్నులను గుత్తులుగా చేర్చి, పిచ్చుకలు తినేందుకై ఇళ్ళలోను, దేవాలయ ప్రాంగణాలలోను కుచ్చులుగా కడతారు. దేవునికి వడ్ల కుచ్చు ఇస్తామని మొక్కుకుని, ఆ మొక్కును కనుమ రోజున తీర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టదలచుకున్న గింజలతో చెరువు గట్టుకో, బహిరంగ ప్రదేశానికో వెళ్ళి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. 
 
పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి, ఆ ముద్దలను ఆరగిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. మినుములతో చేసిన వంటకాలను ఈ రోజున తప్పక భుజించాలి. దీని వల్ల రాహు గ్రహ దోషనివారణ జరుగుతుంది.  అందరూ కనుమ రోజు మాంసం తినాలని అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యతను తెలిపే పండుగ. నేడు పశువులను పూజించాలే తప్ప, భుజించకూడదు. నేడు కనీసం గుడ్డు కూడా తినరాదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Kanuma 2017 Sankranthi Telangana Andhra Pradesh Significance Of Kanuma Festival

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీవారి అభయహస్తాలు ఏం చెబుతాయో తెలుసా...!

దివ్యమంగళకరం శ్రీ వేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే ...

news

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి.. ఏ ముగ్గును ఎక్కడ.. ఎక్కడ వేయాలి?

ఇంటి గడప, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను ...

news

సంక్రాంతి పుణ్యకాలం అంటే..!

ప్రాచీనకాలంలో శాస్త్ర అవగాహనా అంతగా లేని కారణంగా సూర్యగ్రహాన్ని దేవునిగా భావించేవారు. ...

news

మకరసంక్రాతి రోజున పెరుగు దానం చేస్తే? అశ్వత్థామ ఎలా జన్మించాడో తెలుసా?

మకర సంక్రాంతి రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. ...