శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (16:09 IST)

మకర సంక్రమణం ఎప్పుడు..? సంక్రాంతి నాడు గుమ్మడికాయను మరవకండి..

సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.

ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని, సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని విశ్వాసం. అంతేగాకుండా... మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్య్ర బాధలు తొలగిపోతాయి.
 
ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు. 14 జనవరి 2020 మంగళవారం భోగి పండగ ,15 జనవరి 2020 బుధవారం మకర సంక్రాంతి ,16 జనవరి 2020 గురువారం కనుమ పండగ. 
 
మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే? మకర సంక్రమణం శ్రీ వికారినామ సంవత్సరం పుష్యమాసం బహుళ పక్షమి సోమవారం అనగా 14/15 జనవరి 2020  తెల్లవారి... అనగా 14/15  జనవరి 2020  తెల్లవారితే బుధవారం అనగా పుబ్బ నక్షత్రం, శోభన యోగం, తైతుల కరణం సమయంలో రాత్రి 2:08 నిమిషాలకు జగద్రక్షకుడైన శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదంలో మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. 
 
మకర ప్రవేశం రాత్రి సమయం అయినందున మరుసటిరోజైన 15 జనవరి 2020 బుధవారం రోజు మకర సంక్రాంతి పర్వదినం సూర్యోదయం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావున తేదీ 15 మంగళవారం రోజు అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 14 తేదీ మంగళవారం రోజు పంచాంగ ప్రకారం భోగి పండగ అవుతుంది.