ముందు వాడ్ని అడగండి.. ముందు అన్నయ్యను అడగండి.. చిరు-పవన్‌పై పేలుతున్న జోకులు
ఏదైనా ఇష్యూ మొదలైతే దానిపై జోకులేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషనైపోయింది. ఇటీవల తమిళనాడు సీఎం జయలలిత మృతి, శశికళ జైలు, పన్నీర్ సెల్వం తిరుగుబాటు వంటి ఇతరత్రా అంశాలపై ఇంకా సోషల్ మీడియాలో జోకులు
ఏదైనా ఇష్యూ మొదలైతే దానిపై జోకులేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషనైపోయింది. ఇటీవల తమిళనాడు సీఎం జయలలిత మృతి, శశికళ జైలు, పన్నీర్ సెల్వం తిరుగుబాటు వంటి ఇతరత్రా అంశాలపై ఇంకా సోషల్ మీడియాలో జోకులు పేలుతూనే ఉన్నాయి.
అలాంటి జోకులే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు, మెగా హీరోలు చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లపై కూడా పేలుతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అని ప్రకటించగానే, మెగాఫ్యాన్స్ హ్యాపీగా ఫీలైనా.. సరదాగా జోకులు పేలుస్తున్నారు. అందులో చిన్న జోక్ మీ కోసం
చిరంజీవి పవన్‌తో సినిమా గురించి ఇలా అంటున్నారు : ముందు వాడ్ని అడగండి
పవన్ : ముందు అన్నయ్యను అడగండి
టీఎస్సార్ : ఇలా కాదు గానీ, ముందు ప్రెస్ నోట్ ఇచ్చేద్దాం
ఇంతకీ ఈ విషయం చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు తెలుసా?.. అంటూ స్మెలీతో పోస్ట్ చేసేసారు.