Widgets Magazine

అమ్మ.. అమ్మ.. అమ్మ: కొత్త సీఎం పళని స్వామి-పళని ''అమ్మ'' అయిపోయాడా?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (17:24 IST)

Widgets Magazine

తమిళనాడు రాజకీయాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. జల్లికట్టు సందర్భంగా పన్నీర్ సెల్వంపైన కూడా జోకులు పేలాయి. ప్రస్తుతం జైలుకెళ్లిన శశికళపై కూడా జోకులు పేలుతున్నాయి. తాజాగా పళని స్వామి పేరుమీద కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చేస్తున్నారు నెటిజన్లు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారని అన్నాడీఎంకే నేత సీఆర్ సరస్వతి మీడియాతో చెప్పారు. 
 
అయితే.. ఎప్పుడు అమ్మ, చిన్నమ్మ అని పలికిన నోట పళని స్వామిని కూడా అమ్మ అనేసారు. ఎలాగంటే.. ఎడప్పాడి పళనిస్వామికి బదులు ఎడప్పాడి "పళనియమ్మ" అనేశారు. దీనికి సంబంధించి సరస్వతిపై జోకులు పేలుతున్నాయి. ఎప్పుడూ అమ్మ నామ స్మరణ చేసే అన్నాడీఎంకే నేతల నోట అమ్మ స్థానంలో  పురుషులొచ్చినా.. అమ్మగా పిలువబడుతున్నారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ  ఫోటోను చూసిన నెటిజన్లంతా ''మీ అమ్మ ప్రేమకు హద్దుల్లేవా? అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

పాలరంగు పంచెకట్టు.. కనిపిస్తే ఎత్తుకెళ్లిపోతారు..?

పాలరంగు పంచెకట్టుతో బయటికి వెళ్తున్న స్నేహితుడితో సుందరేశం ఇలా అన్నాడు. "ఆగు.. ఆగు.. ...

news

శశికళ రెసార్ట్ ఎమ్మెల్యేల జోక్స్.. సోషల్ మీడియా పేలిపోవాల్సిందే..

రెసార్ట్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మంత్రి నెంబర్ 1 : "ఇదేం ...

news

ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు వెళ్ళనివ్వకండి..

"ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు కూడా వెళ్ళనివ్వకండి.. చెప్పిన శశికళ క్యాంప్ "ఎందుకు సార్..? ...

news

తిండికి-ఇన్సూరెన్స్‌కు లింకుందా?

''నేనూ మీకు రోజూ ఇలాంటి తిండి పెడితే ఏమొస్తుందండి..?'' భర్తకు వడ్డిస్తూ అడిగింది ...