సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. సముద్ర తీరాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2024 (18:56 IST)

వికసించే తోటల నుండి సూర్య కాంతితో తడిచి ముద్దైన బీచ్‌ల వరకు: దుబాయ్‌లో వేసవి వినోదం

Dubai beach
వసంత ఋతువు యొక్క ప్రకాశవంతమైన రంగులు, బంగారు రంగులోకి మారినప్పుడు, దుబాయ్ అంతులేని అవకాశాలను అందిస్తుంది. థ్రిల్ కోరుకునే వారైనా, ఆహారాన్ని ఇష్టపడే వారైనా లేదా ప్రకృతి ప్రేమికులైనా, దుబాయ్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది. దుబాయ్‌లో మీ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి, దుబాయ్ మాయాజాలంలో మునిగిపోవడానికి మేము మీకు చక్కటి గైడ్‌ను అందిస్తున్నాము. 
 
హాట్ ఎయిర్ బెలూన్‌తో ఎగరండి
గంభీరమైన ఎడారి దిబ్బలపై ప్రత్యేకమైన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌తో దుబాయ్‌లో మరపురాని ప్రయాణాన్ని ప్రారంభించండి. ఉల్లాసకరమైన అనుభవం కోసం బెలూన్ అడ్వెంచర్స్‌తో సాహసయాత్రను ప్రారంభించండి.
 
బచీర్‌ వద్ద దుబాయ్‌లో అత్యుత్తమ ఐస్‌క్రీమ్‌ను రుచి చూడండి
బచీర్‌ వద్ద, ఐస్ క్రీం యొక్క ఆహ్లాదకరమైన స్కూప్‌లను ఆస్వాదించండి. ఈ లెబనీస్ ఐస్ క్రీంలో నిమ్మకాయ పుదీనా, గులాబీ లౌకౌమ్ వంటి ప్రాంతీయ రుచులను కూడా జోడించటం వల్ల విలక్షణమైన రుచిని అభిమానులు ఇష్టపడతారు.
 
ఆక్వావెంచర్ వాటర్‌పార్క్‌లో సరదాగా డైవ్ చేయండి 
దుబాయ్‌లోని ప్రధాన వాటర్‌పార్క్ గమ్యస్థానమైన ఆక్వావెంచర్‌లో ఉల్లాసకరమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి! 105 స్లయిడ్‌లు మరియు రైడ్‌లతో అన్ని వయస్సుల వారికి వినోదాన్ని అందించే ప్రాంగణమిది.
 
దుబాయ్ ఎడారులలో డూన్ బగ్గీలు, క్వాడ్ బైక్‌లను ఆస్వాదించండి
దుబాయ్ ఎడారులలోని బంగారు ఇసుకలో సాహసయాత్రను ప్రారంభించండి. డూన్ బగ్గీలు లేదా క్వాడ్ బైక్‌ల ఫై విజయాన్ని సొంతం చేసుకోండి. 
 
దుబాయ్ మిరాకిల్ గార్డెన్‌ అందాలలో లీనమవండి 
దుబాయ్ మిరాకిల్ గార్డెన్‌లో 150 మిలియన్లకు పైగా వికసించే పుష్పాలకు నిలయమైన పూల అందాల అద్భుత ల్యాండ్‌లో మిమ్మల్ని మీరు సంతోష పరుచుకోండి. రంగురంగుల తోరణాల నుండి విచిత్రమైన శిల్పాల వరకు, దుబాయ్ మిరాకిల్ గార్డెన్ తన సహజ వైభవంతో అన్ని వయసుల సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
 
కైట్ బీచ్ వద్ద ఆనందానుభూతులను పొందండి 
కనుచూపు మేరలో బంగారు ఇసుకలు విస్తరించి ఉన్న కైట్ బీచ్‌లో మీరు ఆనందకరమైన విశ్రాంతిని కోరుతున్నా లేదా ఉత్కంఠభరితమైన వాటర్ స్పోర్ట్స్‌ను కోరుతున్నా, మరపురాని రోజును వాగ్దానం చేస్తుంది.