1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:50 IST)

భారత మార్కెట్లు బంద్- గుడ్ ఫ్రైతో సెలవు..

భారత మార్కెట్లు బంద్ అయ్యాయి. గుడ్ ఫ్రైడ్ కారణంగా బాంబే స్టాక్ మార్కెట్లు మూతపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) శుక్రవారం బంద్‌ పాటిస్తున్నాయి. మెటల్‌, బులియన్‌తో పాటు హోల్‌సేల్‌ కమొడిటి మార్కెట్‌ సైతం బంద్‌ అయ్యాయి. కాగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌, కమొడిటి ఫ్యూచర్స్‌ మార్కెట్లు యథాతంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 
 
ఇకపోతే భారత మార్కెట్లు ఏప్రిల్ 13 అంటే సోమవారం పూట తెరుచుకోనున్నాయి. కాగా గురువారం సెన్సెక్స్‌ 1,266 పాయింట్లు వృద్ధి సాధించి 31,160 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 363 పాయింట్లు వృద్ధితో 9,112 వద్ద ముగిసింది.
 
కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరోమారు సహాయాన్ని ప్రకటించనున్నట్లు పరిశ్రమ నిర్వహాకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గురువారం బాంబే స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి.