శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (11:11 IST)

#stockmarketcrash.. అది నిన్న.. ఈ రోజు మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్

BSE
BSE
బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు వారం మొదటి రోజైన సోమవారం నష్టాలను చవిచూశాయి. శీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ బీఎస్ఈ 617 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 161 పాయింట్లను కోల్పోయింది. దీంతో సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ కుదేలైంది. 
 
అయితే మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. బ్యాంక్, ఐటీ సెక్టార్ సూచీలు లాభాల బాట పడటం బాంబే స్టాక్ మార్కెట్‌ను లాభాలను ఆర్జించేలా చేసింది. 
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బీఎస్ఈ 170 పాయింట్లు లాభపడి.. 73,673 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ కూడా 17 పాయింట్లు పుంజుకుని 22.350 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.