Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కామన్వెల్త్ క్రీడలు : మణిపూర్ మాణిక్యం మేరీకోమ్‌కు బంగారు

శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:58 IST)

Widgets Magazine

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చిచేరింది. మణిపూర్ మాణిక్యం మేరీకోమ్ ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ విభాగంలో ఆమెకు గోల్డ్ మెడల్ వరించింది.
mary kom
 
కాగా, ఐదు నెలల క్రితం ఆసియా చాంపియన్‌‌షిప్‌‌ను గెలుచుకున్న మేరీ.. అదే దూకుడును కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ ప్రదర్శించింది. ముఖ్యంగా, ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ బౌట్‌లో చెలరేగిన తీరు అందర్నీ ఆకట్టుకున్నది. మేరీ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ గోల్డ్ మెడల్ చేరింది. 
 
ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ మేరీ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిళ్లు మేరీ ఖాతాలో ఉన్నాయి. మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రిలీజైన విషయం తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

''దంగల్'' బబితకు రజతం.. అమీర్ ఖాన్ తరహాలోనే క్లైమాక్స్‌లో..?

అమీర్ ఖాన్ హీరోగా నిర్మించిన ''దంగల్'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ...

news

80 సెకన్లలో ఇండియాకు స్వర్ణ పతకం... రెజ్లర్ సుశీల్ కుమార్ భేష్

ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని ...

news

కామన్వెల్త్ గేమ్స్.. భారత్ ఖాతాలో 25 పతకాలు.. అదరగొడుతున్న హాకీ జట్టు

ఆస్ట్రేలియాలో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. 50 మీటర్ల ...

news

లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బీబీసీ రిపోర్టర్ (Video)

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ 2018 క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ ...

Widgets Magazine