శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:41 IST)

ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఓ బుడ్డోడు.. వీడియో వైరల్

2-year-old boy
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఓ బుడ్డోడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళితే.. సిన్‌సిన్నాటి, ఓర్లాండో మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. అందరూ సీరియస్‌గా మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. ఇంతలో ఓ బుడ్డోడు నెమ్మదిగా తల్లి ఒడినుంచి దిగిపోయి గ్రౌండ్‌లోకి పాక్కుంటూ వచ్చేశాడు. 
 
సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న తల్లి పరధ్యానంగా ఉండగా ఆ పిల్లాడు ఒడిలోంచి జారి గ్రౌండ్‌లోకి వచ్చేశాడు. కాసేపటికి తేరుకున్న ఆమె ఫెన్సింగ్‌ కింద నుంచి పాకుతూ గ్రౌండ్‌ వైపు పోతున్న సంగతి గుర్తించింది.
 
వెంటనే రియాక్ట్‌ అయ్యి ఒక దూకున బారికేడ్‌ దూకి కొడుకు వెంటే గ్రౌండ్‌లోకి దౌడు తీసింది. అప్పటికే ఆ పిల్లాడు గ్రౌండ్ లోకి వచ్చేశాడు. పరుగులు పెట్టుకుంటూ వెళ్లిన ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టుకుంది. అక్కడే ఉండే సిబ్బంది సహకారం లేకుండానే పిల్లాడిని పట్టుకుని గ్రౌండ్‌ నుంచి బయటకు పరుగుపెట్టుకుంటూ వచ్చేసింది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా గోల చేశారు.
 
కట్‌ చేస్తే.. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. కేవలం సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్‌ లీగ్‌ సాకర్‌ ట్విటర్‌ పేజ్‌ ఆ సరదా వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ బుడ్డోడు పేరు జేడెక్‌ కార్పెంటర్‌, ఆ తల్లి పేరు మోర్గాన్‌ టక్కర్‌. ఓహియోలో ఉంటారు.