Widgets Magazine

కోర్టులో లోదుస్తులు మార్చుకున్న టెన్నిస్ క్రీడాకారిణి... అంపైర్ ఫైర్

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:34 IST)

టెన్నిస్ కోర్టులో టెన్నిస్ క్రీడాకారిణి బట్టలు మార్చుకుంది. దీంతో ఆమెపై కోర్టు అంపైర్ మండిపడ్డారు. ఇది పెను దుమారానికి దారితీసింది. యూఎస్ ఓపెన్ పోటీలు జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్, మైదానంలో తన బట్టలు మార్చుకోవడం, లోదుస్తులు పైకి కనిపించడంతో చైర్ అంపైర్ తప్పుబట్టడారు.
Alizé Cornet
 
కార్నెట్ తన తొలి మ్యాచ్‌ని జొహన్నా లార్సన్‌తో ఆడుతున్న వేళ, తన టాప్‌ను సరిగ్గా ధరించకుండా కోర్టులోకి వచ్చింది. వెనుకభాగం ముందుకు వచ్చేలా ఆమె టాప్ ధరించగా, బాయ్‌ఫ్రెండ్ గుర్తించి సైగ చేశాడు. 
 
దీంతో ఆమె మళ్లీ లాకర్ రూములోకి ఎందుకు వెళ్లాలని భావించిందో ఏమో, పదంటే పది సెకన్లలో తన టాప్‌ను పైకి తీసి, సరిచేసుకుని ధరించింది. ఆమె చేసిన పనికి చైర్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. 
 
నిజానికి డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం, మహిళలు కోర్టులో దుస్తులు మార్చుకునేందుకు వీలు లేదు. పురుషులకు ఆ నిబంధన ఏమీ లేదు. తాజాగా, కార్నెట్ వ్యవహారం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేగా, పురుషులకు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకని మాజీలు ప్రశ్నిస్తున్నారు.
 
దీంతో కార్నెట్‌కు మద్దతు పలుకుతూ, పలువురు కామెంట్లు చేస్తుండటంతో యూఎస్ ఓపెన్ నిర్వాహకులు, ఆమెకు వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందని ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

శభాష్ అమ్మాయిలు... ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం...

ఆసియా క్రీడల్లో 12వ రోజు భారతదేశానికి మన క్రీడాకారులు ఏకంగా 5 పతకాలను సాధించిపెట్టారు. ...

news

చాక్లెట్ తింటా.. అందుకే బుగ్గపై ప్లాస్టర్.. ఎవరు?

పంటి నొప్పి రావడంతో బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని పోటీలో దిగానని ఆసియా క్రీడల్లో స్వర్ణం ...

news

ఆసియా క్రీడలు.. పతకాల పంట పండిస్తున్న భారత్ క్రీడాకారులు

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్ సత్తా చాటింది. బుధవారం అథ్లెట్లు రెండు పసిడి పతకాలు ...

news

'బంగారు' రాణికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగిన ప్రియుడు

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల రెజ్లింగ్ పోటీల్లో భారత్‌కు బంగారు పతకం ...

Widgets Magazine