గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:41 IST)

కాషాయం కండువా కప్పుకున్న మల్లయోధురాలు

ప్రముఖ మల్లయోధురాలు (ఇంటర్నేషనల్ రెజ్లర్) బబితా ఫోగట్ కాషాయం జెండా కప్పుకున్నారు. గత కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం అందించిన ఈ క్రీడాకారిణి, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించి, ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఆమెతో పాటు.. ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీలో చేరారు. 
 
మల్లవిద్యలో తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథంలో నడిపిన మహావీర్ ఫొగట్ ప్రముఖ బాలీవుడ్ చిత్రం దంగల్‌కు స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ హర్యానా శాఖ ఇంచార్జి అనిల్ జైన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా సమక్షంలో వారు బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి మోడీ చరిత్ర సృష్టించారని, ఆయనకు తాను వీరాభిమానినని బబిత చెప్పారు. కాశ్మీరీ వధువుల గురించి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హర్యానా సీఎం ఖట్టర్‌కు ఆమె బాసటగా నిలిచారు. ఆయన ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదన్నారు.