1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:34 IST)

కోర్టులో వేగంగా కదల్లేకపోతున్నా: ఫాంపై రఫెల్ నాదల్ ఆందోళన

స్పెయిన్ బుల్, క్లే కోర్టుల రారాజు రఫెల్ నాదల్ తన ఫాంపై ఆందోళన వ్యక్తం చేశాడు. తన పూర్వపు ఫాం అందుకోగలననే నమ్మకం లేదని, అయినా ప్రయత్నిస్తానని నాదల్ మాటిచ్చాడు. అయితే తన ప్రతిభ గత వైభవంగా మారిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. పూర్వవైభవం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని నాదల్ తెలిపాడు. మునుపటి ఫాంను అందుకోగలనో, లేదోననే నాదల్ అనుమానం వ్యక్తం చేశాడు. 
 
ఇకపోతే.. వింబుల్డన్‌లో ఐదుసార్లు ఫైనల్ చేరి, రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన నాదల్ రెండో రౌండ్లోనే అనామక ఆటగాడి చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో, తన ఫాంపై రఫెల్ నాదల్ మాట్లాడుతూ, కోర్టులో ధీటుగా రాణించలేకపోతున్నానని చెప్పాడు. అయితే పూర్వపు ఫామ్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు.