శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:58 IST)

జోహార్ కప్ అండర్ -21 హాకీ టోర్నీ: భారత్‌కు టైటిల్!

జోహార్ కప్ అండర్ -21 హాకీ టోర్నీలో భారత జట్టు విజయఢంకా మోగించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన హర్మన్ ప్రీత్ ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డబుల్ గోల్స్‌తో మెరవడంతో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. 
 
45వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న హర్మన్‌ ప్రీత్ బంతిని నెట్‌కు చేర్చి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌తో భారత్ తలపడింది. హర్మన్‌ ప్రీత్ 45, 90 నిమిషాల్లో గోల్స్ కొట్టి ఫైనల్‌లో హీరోగా నిలిచాడు. 
 
2011లో ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2011లో మలేసియా విజేతకాగా, 2012లో జర్మనీ విజేతగా నిలిచింది. 2013లో భారత్ టైటిల్ నెగ్గింది. దీంతో రెండవ స్దానంలో గ్రేట్ బ్రిటన్ నిలవగా మూడవ స్దానం కోసం జరిగిన పోటీలో ఆస్ట్రేలియా 6-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధంచింది.