ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (18:15 IST)

ఆశలన్నీ శ్రీకాంత్ పైనే.. సైనా, సింధు చేతులెత్తేశారు..

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ ఇంటి ముఖం పట్టింది. హైదరాబాదీ సూపర్ ప్లేయర్ పీవీ సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవని సింధు.. హాంకాంగ్ ఓపెన్‌లోనూ చేతులెత్తేసింది.

మరోవైపు హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీలో రాణించలేకపోయింది. సైనా తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. ఇక గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో పీవీ సింధు దక్షిణ కొరియా క్రీడాకారిణి సంగ్ జి హ్యూన్ చేతిలో పరాజయం పాలైంది.
 
కానీ పురుషుల విభాగంగా స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సహచర ప్రణయ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలుపును నమోదు చేసుకున్నాడు.

వరుసగా రెండు సెట్లు గెలిచిన శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా హాంకాంగ్ ఓపెన్‌లో భారత క్రీడాకారులంతా ఓటమితో వెనుదిరగగా శ్రీకాంత్ పైనే క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.