ఇండియన్ వెల్స్ మ్యాచ్.. 36వసారి పోటీపడిన ఫెదరర్-నాదల్.. స్విజ్ మాస్టర్‌దే గెలుపు

గురువారం, 16 మార్చి 2017 (17:36 IST)

ఇండియన్ వెల్స్ మాస్టర్స్‌లో స్విజ్ మాస్టర్‌ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ మధ్య జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ జయకేతనం ఎగురవేశాడు. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో రోజర్ ఫెదరర్‌ను విజయం వరించింది. 68 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రోజర్ ఫెదరర్‌ ధీటుగా రాణించాడు. ఫలితంగా వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్‌పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు. 
 
కాగా ఫెదరర్, నాదల్‌ల మధ్య పోరు ఇది 36వ సారి కావడం గమనార్హం. ఇండియన్ వెల్స్ క్వార్టర్ విజయానంతరం ఫెదరర్ హర్షం వ్యక్తం చేశాడు. నాదల్ మాట్లాడుతూ.. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఫెదరర్ తన కంటే చాలా బాగా ఆడాడని నాదల్ పేర్కొన్నాడు. ఇకపోతే.. సెమీఫైనల్లో కిర్గియోస్‌తో ఫెదరర్ పోరు జరుగనుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత ...

news

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో ...

news

ప్రచారం కోసమే నగదు - పురస్కారాలు ప్రకటించారా? దుమారం రేపుతున్న సాక్షి మలిక్ ట్వీట్లు

సాక్షి మాలిక్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్. రియో ఓలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన మల్లయుద్ధ ...

news

అమెరికాలో భారత అథ్లెట్ అరెస్టు... ఎందుకో తెలుసా?

అమెరికాకు వెళ్లిన భారత అథ్లెట్ అరెస్టు అయ్యాడు. అదీ అత్యాచారం కేసులో ఆ దేశ పోలీసులు ...