ఆ క్రీడాకారుడూ లైంగికంగా వేధించాడు : జ్వాలా గుత్తా

jwala gutta
Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (10:48 IST)
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ ఉద్యమానికి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. అదేసమయంలో పలువురు మహిళా ప్రముఖులు తమకు ఎదురైన వేధింపులను బహిరంగతం చేస్తున్నారు. ఈ కోవలో టెన్నిస్ స్టార్ జ్వాలా గుత్తా కూడా చేరిపోయింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తన కెరీర్‌లో సూపర్ ఫాంలో ఉన్నదశలోనూ ఓ క్రీడాకారుడు మెంటల్ హరాష్‌మెంట్(మానసిక వేధింపులు) చేశాడని వెల్లడించింది. 2006 వరకు జాతీయజట్టులో ఉన్నాడు. 2006లో ఆ సదరు వ్యక్తి చీఫ్ కోచ్‌గా మారాక నన్ను జట్టు నుంచి తొలిగించాడని వాపోయాడు. 
 
జాతీయ చాంపియన్‌గా ఉన్న నన్ను జాతీయ జట్టు నుంచి అకారణంగా తప్పించాడు. రియో ఒలింపిక్స్ తర్వాత కూడా ఇదే తరహాలో జట్టు నుంచి ఉద్వాసనకుగురయ్యాను. నేను బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ కావడానికి ఆ క్రీడాకారుడి వేధింపులే కారణం అంటూ జ్వాలా గుత్తా ఆరోపించింది.దీనిపై మరింత చదవండి :