శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (08:15 IST)

సెక్యూరిటీని ఛేదించి మెస్సీని హగ్ చేసుకున్న అభిమాని (వీడియో)

Messi
Messi
అర్జెంటీనా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న స్నేహపూర్వక సాకర్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీని ఛేదించి మెస్సీని కౌగిలించుకున్నాడు.
 
మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్. అతను అర్జెంటీనాకు చెందినవాడు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ సిరీస్‌లో జాతీయ జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా - ఆస్ట్రేలియా జట్ల మధ్య స్నేహపూర్వక అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. 
 
ఇందులో ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన అర్జెంటీయా 2-0తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మెస్సీ నంబర్ ఉన్న జెర్సీని ధరించిన అభిమాని డిఫెండర్లను దాటుకుని, స్టేడియంలోకి ప్రవేశించి మెస్సీని కౌగిలించుకున్నాడు. 
 
అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు విఫలమయ్యారు. మెస్సీ తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పంచుకున్నాడు. "దిస్ ఈజ్ క్రేజీ" అని రాశాడు.
 
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఆట 79వ సెకను లోపు అద్భుతమైన గోల్ చేశాడు. అతని కెరీర్‌లో అత్యంత వేగవంతమైన గోల్ కూడా ఇదే కావడం గమనార్హం.