శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (17:45 IST)

ఎన్నో మార్పులొచ్చాయ్... టెన్నిస్‌కు పాతదాన్ని అయిపోయా: సానియా మీర్జా

తనకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన టెన్నిస్ క్రీడ పట్ల హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత 15 యేళ్ళలో అంతర్జాతీయ క్రీడ అయిన టెన్నిస్‌లో ఎ

తనకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన టెన్నిస్ క్రీడ పట్ల హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత 15 యేళ్ళలో అంతర్జాతీయ క్రీడ అయిన టెన్నిస్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. దీంతో తాను టెన్నిస్‌కు పాతదాన్ని అయిపోయానని చెప్పుకొచ్చింది. 
 
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్ పోరు జరిగింది. ఇందులో సానియా మీర్జా- స్ట్రికోవా జోడీ రన్నరప్‌గా నిలిచింది. అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన వై.జు (చైనా)- గాబ్రియల్ (కెనడా) చేతిలో సానియా జంట ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం సానియా పైవిధంగా స్పందించింది.