లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో మెరిసిన నీరజ్ చోప్రా  
                                       
                  
                  				  టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ నీరజ్ చోప్రా లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో మెరిశాడు. లీగ్ పోటీల్లో 87.66 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి విజేతగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. రెండో ప్రయత్నంతో 83.52, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్ల దూరం విసిరాడు. 
				  											
																													
									  
	 
	అయితే, నాలుగో ప్రయత్నంలో మళ్లీ విఫలమయ్యాడు. ఐదో ప్రయత్నంలో మాత్రం పుంజుకుని ఏకంగా 87.03 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లి విజేతగా నిలిచాడు. ఇక ఈ ఏడాది ఖతర్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్ టోర్నీలోనూ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.