గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (12:16 IST)

ఒలింపిక్స్ క్రీడలకు చిన్నారి.. అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్

Hend zaza
జపాన్‌లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు 12 ఏళ్ల చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు 'హెంద్ జాజా'. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షించింది. 
 
సిరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ జజా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 12 ఏళ్ల ఈ చిన్నారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనిచాల్సిన విషయం. 
 
ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో ఆమె స్థానం 155. గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమాసియా టేబుల్ టెన్నిస్ అర్హత టోర్నీలో టైటిల్ సాధించడం ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కొట్టేసింది చిన్నారి హెంద్. అప్పటికి ఆమె వయసు 11 సంవత్సరాలే కావడం గమనార్హం.
 
1968లో జరిగిన యూఎస్ లోని మెక్సికో ఒలింపిక్స్‌లో రొమేనియాకు చెందిన 13 ఏళ్ల ఫిగర్ స్కేటర్ బిట్రీస్ పాల్గొంది. ఆ తర్వాత మళ్లీ ఇంతకాలానికి అంతకంటే చిన్న వయసున్న హెంద్ జాజా టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడబోతోంది.