శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (10:31 IST)

రియోలో రజతం సాధించిన వేళా విషయం.. పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం..

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వేళా విశేషం ఏమో కానీ.. భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పీవీ సింధుకి అదృష్టం కలిసొచ్చింది. తాజాగా పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వేళా విశేషం ఏమో కానీ.. భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పీవీ సింధుకి అదృష్టం కలిసొచ్చింది. తాజాగా పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అధ్యక్షతన గురువారం పాలకమండలి సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది.  
 
పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం అంశంలో ఏపీపీఎస్సీ త్వ‌ర‌లోనే నియామ‌క‌ ఉత్త‌ర్వులు ఇవ్వ‌నుంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ప‌తకం సాధించి దేశానికి గర్వ‌కార‌ణంగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేప‌థ్యంలో ఆమెకు నజరానా అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఒలింపిక్ క్రీడల్లో బాడ్మింటన్‌లో రజత (వెండి) పతకం సాధించి దేశానికే కీర్తి తెచ్చిన తెలుగమ్మాయి పీవీ సింధుకు తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు భారీగా నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.