పుల్లెల గోపిచంద్ రియల్ హీరో : సచిన్ టెండూల్కర్, సింధు - సాక్షి - దీపాలకు కార్లు బహుకరణ
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుల్లెల గోపీచంద్ 'రియల్ హీరో' అంటూ కీర్తించాడు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుల్లెల గోపీచంద్ 'రియల్ హీరో' అంటూ కీర్తించాడు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్.. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్‌లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ సింధు, గోపిచంద్, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు.
అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే రాణించి, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించగలరన్నారు. వీరిని చూసి భారత్ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మున్ముందు వీరంతా మరింతగా రాణిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.