శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (10:00 IST)

రియో ఒలింపిక్స్.. అథ్లెట్లకు అందుబాటులో భారతీయ వంటకాలు: గుప్తా క్లారిటీ

లండన్‌లో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఒలింపిక్ పోటీల్లో భారత్ నుంచి సుమారు వంద మందికిపైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. అయితే 2012 విశ్వక్రీడల్లో శాకాహారం దొరకక భారత్ అథ్లెట్లు తీవ్ర ఇబ

లండన్‌లో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఒలింపిక్ పోటీల్లో భారత్ నుంచి సుమారు వంద మందికిపైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. అయితే 2012 విశ్వక్రీడల్లో శాకాహారం దొరకక భారత్ అథ్లెట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి పునరావృతం కాకుండా రియో ఒలింపిక్స్‌లో చర్యలు తీసుకోవాల్సిందిగా భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అక్కడి ఆహారం తమ అథ్లెట్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదని ముందే నిర్వాహకులకు లేఖ రాశామని రియో ఒలింపిక్స్‌ భారత చీఫ్‌ డి మిషన్‌ రాఖేష్‌ గుప్తా తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో లండన్ ఒలింపిక్స్ సందర్భంగా భారత అథ్లెట్ల ఆహార విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవని నిర్వాహకులు అంటున్నారు. ఒలింపిక్‌ గ్రామంలో భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయని రియో నిర్వాహకులు తెలిపారు. అంతేగాకుండా తమకు రియో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించిందని గుప్తా చెప్పుకొచ్చారు.