Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చరిత్ర సృష్టించిన ఫెదరర్... ఖాతాలో 19 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్

సోమవారం, 17 జులై 2017 (09:55 IST)

Widgets Magazine
roger federer

స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా మరోమారు నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్  ఫైనల్స్‌లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన్ సిలిక్‌పై ఘన విజయం సాధించాడు. సిలిక్‌పై 6-3, 6-1, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ కెరీర్‌లో 8వ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించినట్టయింది. 
 
గతంలో ఈ తరహా అరుదైన ఫీట్‌ను సంప్రాస్ వింబుల్డన్ సాధించాడు. తాజా విజయంతో ఫెదరర్ ఈ రికార్డును అధిగమించాడు. దీంతో, అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, వింబుల్డన్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఫెదరర్ ఖాతాలో 19వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను వేసుకున్నాడు. 
 
కాగా, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012లో వింబుల్డన్ టైటిళ్లను ఫెదరర్ సాధించాడు. 2012లో ఆండీ ముర్రేను ఓడించి, వింబుల్డన్ టైటిల్‌ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. 2014, 2015 వింబుల్డన్ సింగిల్స్‌లో ఫెదరర్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ విజయంతో రోజర్ ఫెదరర్‌ టైటిల్‌తో పాటు రూ.18.5 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందుకున్నాడు.
 
ఈ విజయంపై ఫెదరర్ స్పందిస్తూ.. నేను ఈ స్థాయికి ఎదుగుతానని ఊహించలేదు. 2014, 15 ఫైనల్స్‌లో నొవాక్‌ చేతిలో ఓటమి అనంతరం గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా. గతేడాది సెమీస్‌లో వెనుదిరిగాక మరోసారి ఫైనల్‌కు వస్తానని ఊహించలేదు. కానీ.. ఎప్పుడూ నమ్మకం కోల్పోకుండా పోరాడాను. ఇప్పుడిలా మీ ముందు నిలవడం నిజంగా అద్భుతం. ఇది ప్రత్యేకమైన కోర్టు. ఎంతోమంది దిగ్గజాలు తమ ముద్ర వేశారు. ఈ రోజు సిలిక్‌తో కలిసి టెన్నిస్‌ను ఆస్వాదించడం మరెంతో ప్రత్యేకం. మారిన్‌ బాగా పోరాడాడు. అతను ఒక హీరో. అద్భుతమైన టోర్నమెంట్‌ ఆడిన అతనికి శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Win Roger Federer Wimbledon Title History Man

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఆ జాబితాలో ప్రభాస్‌కు ఆరో స్థానం.. పీవీ సింధుకు అగ్రస్థానం...

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ ...

news

జకోవిచ్‌తో డేటింగ్ కోసం పరితపించిన దీపిక : ఈ మాట ఎవరన్నారు?

దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్. ఇటీవల హాలీవుడ్ చిత్ర ప్రవేశం కూడా చేసింది. ట్రిపుల్ ...

news

వింబుల్డెన్ టోర్నీ ముగియలేదు.. కానీ, విజేతగా రోజర్ ఫెదరర్... ఎలా?

ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. తొలి రౌండ్ పోటీలు పూర్తికాకముందే ఈ ...

news

'నేను మతిలేకుండా ఆడుతున్నా' : విశ్వనాథ్ ఆనంద్

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపారు. ఆయన అలాంటి ...

Widgets Magazine