ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (12:58 IST)

EURO 2020 : గోల్ కీపర్ కంగారు పడ్డాడు.. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్స్ యాడ్

Goal Keeper
గోల్ కీపర్ కంగారు పడ్డాడు అంతే.. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్స్ యాడ్ అయ్యింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ  గోల్‌కీపర్‌కి మాత్రం చేదు అనుభవమే మిగిలింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్‌ ఆడియెన్స్‌లో టెన్షన్‌ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. 
 
స్పెయిన్‌, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(​‍స్పెయిన్‌ క్లబ్‌) మిడ్‌ ఫీల్డర్‌ పెడ్రి బంతిని పాస్‌  చేయగా.. అది గోల్‌కీపర్‌ ఉనయ్‌ సైమన్‌ ముందుకొచ్చింది. 
 
అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్‌ నెట్‌ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని.. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు.