సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మే 2023 (19:57 IST)

సుదిర్మన్ కప్: పీవీ సింధు నిష్క్రమణ.. రెండో రౌండ్‌లోనే అవుట్

pv sindhu
సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. చైనాలోని సుజౌలో జరుగుతున్న ఈ టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌లోనే పరాజయం పాలైంది. మూడు గేముల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు  21-14, 10-21, 20-22తో గోహ్ జిన్ వీ చేతిలో ఓటమిపాలైంది.
 
మరోవైపు అశ్విని పొన్నప్ప-ధృవ్ కపిల జోడీ మలేషియా షట్లర్లు గోహ్ సూన్ హువాత్-లాయ్ షెవోన్ జెమీ చేతిలో 16-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు కూడా ఓడిపోయాడు. శ్రీకాంత్ 16-21, 11-21తో మలేసియా షట్లర్ లీ జీ జియా చేతిలో ఖంగుతిన్నాడు.