మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (15:21 IST)

శవపేటిక చుట్టూ స్నేహితులు... కన్నీరు పెట్టిస్తున్న వీడియో

ఆ కుర్రోడికి ఫుట్‌బాల్ అమితమైన ప్రాణం. అతనికి ఫుట్‌బాలే అతని శ్వాసగా మారింది. అలాంటి కుర్రోడు.. ఇటీవల అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. అంతే... అతని స్నేహితులు అతని మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు. చివరకు తన స్నేహితుడి మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఫుట్‌బాట్ మైదానంలోకి తీసుకొచ్చారు. అక్కడ కొద్దిసేపు ఉంచారు. గోల్ఫ్‌కు ఎదురుగా శవపేటికను పెట్టి ఒకరు ఫుట్‌బాల్‌ను కిక్‌ చేయగా అది శవపేటికకు తగిలింది. అంతే అది నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది.
 
ఫుట్‌బాల్‌ అంటే ప్రాణంగా బతికిన ఆ కుర్రాడి మృతదేహం ఉన్న శవపేటికను తాకినా ఆ బాల్ ‌గోల్‌పోస్ట్‌కి వెళ్లడంతో అతడి స్నేహితులు కన్నీరు ఆపుకోలేకపోయారు. శవపేటిక చుట్టూ చేరి ఏడ్చాశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
 
నెటిజన్లతోనూ ఈ వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. అతడు చివరి గోల్‌ వేశాడని కామెంట్లు చేస్తున్నారు. మెక్సికోలో ఈ ఘటన చోటు చేసుకుంది 16 ఏళ్ల ఫుట్‌బాల్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ మార్టినేజ్‌ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.