ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (10:28 IST)

టోక్యో ఒలింపిక్స్ : క్వార్టర్‌కు ఆర్చరీ... ఫెన్సింగ్‌లో భవానీ దేవి ఔట్

టోక్యో ఒలింపిక్స్‌లో పలు క్రీడల్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్ ఆడకుండా బి. సాయి ప్రణీత్ ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్‌బెర్మాన్ తన రెండో మ్యాచ్‌లో ప్రణీత్‌ను ఓడించాడు. దీంతో ప్రణీత్ గ్రూప్‌లో టాప్ 2లో చేరే అవకాశం లేకుండా పోయింది.
 
మరోవైపు, ఫెన్సింగ్‌లో ఎన్నో ఆశలతో ఒలింపిక్స్ అరంగేట్రం చేసిన భవానీ దేవి రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచులో 15-7 తేడాతో ఓడిపోయింది. ఒలింపిక్స్ స్థాయిలో ఫెన్సింగ్‌లో భారతదేశం తరపున తొలి అడుగులు వేసిన భవానీ… ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.
 
అదేవిధంగా టేబుల్ టెన్నిస్ విభాగంలో అచంత్ శరత్ కమల్ 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు.
 
ఇకపోతే, పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. చివరి రౌండులో కజకిస్తాన్ 54/60 స్కోరు సాధించింది. చివరి షాట్‌లో భారత్‌కు 9 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు అవసరం. దీంతో అతను దాస్ 9 పాయింట్లు సాధించి జట్టుకు 6-2 విజయాన్ని అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో చేరిన భారత ఆర్చరీ టీం.. కొరియాతో తలపడనుంది.