బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (13:52 IST)

ఉక్రెయిన్ స్ట్రైకర్ యారెంచుక్ కంటతడి.. ఎందుకో తెలుసా? (video)

Yaremchuk
ఉక్రెయిన్ స్ట్రైకర్ రోమన్ యారెంచుక్ కంటతడి పెట్టాడు. రష్యన్ సైనిక ఆక్రమ తర్వాత తన దేశానికి సంఘీభావంగా ఎస్‌ఎల్ బెన్ఫికా- విటోరియా ఎస్సీ మధ్య జరిగిన మ్యాచ్‌లో లిస్బన్‌లోని ఓ స్టేడియంలో యారెంచుక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మూమెంట్ స్పీచ్ లెస్ అనే క్యాప్షన్‌తో యారెంచుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఫుట్‍‌బాల్ స్టేడియంలో యారుంచెక్ ఆడుతుంటే వందలాది మంది అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో ఉక్రేనియన్ స్ట్రైకర్ రోమన్ యారెమ్ చుక్ కన్నీటి పర్యంతమయ్యాడు.
 
ఆదివారం ఆట ప్రారంభానికి ముందు ప్రేక్షకుడి చప్పట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఫుట్ బాల్ క్రీడాకారుడి కళ్లు చమర్చాయి. మ్యాచ్ చివరి అరగంట పాటు యారెంచుక్‌కు కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్ కూడా అప్పగించబడింది. దీంతో యారుంచుక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.