Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇన్‌స్టాగ్రామ్‌లో సెరెనా పాప ఫోటోలు... వెక్కి వెక్కి ఏడ్చిందన్న మరియా షరపోవా?

గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:50 IST)

Widgets Magazine

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తల్లైన సంగతి తెలిసిందే. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో సెరెనా కుమార్తె ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్న 35 ఏళ్ల సెరెనా సెప్టెంబర్ ఒకటో తేదీన పాపాయికి జన్మనిచ్చింది.

పాపకు అలెక్సిన్ ఒలింపియా ఒహానియర్ జూనియర్ అనే పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు ఉన్నానని, గర్భం దాల్చినప్పటి నుంచి పాపకు జన్మనిచ్చేంత వరకు జరిగిన పరిణామాలపై సెరెనా డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. 
 
ఇలా పాపాయి పుట్టిన సంతోషంలో వున్న సెరెనా విలియమ్స్‌పై రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తన ఆటోబయోగ్రఫీలో వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. దశాబ్ధకాలం పాటు టెన్నిస్‌లో రాణించిన సెరెనా తనపై ద్వేషం పెంచుకుందని ''అన్‌ స్టాపబుల్‌ –మై లైఫ్‌ సో ఫర్''లో షరపోవా వెల్లడించింది.

తన శ్వేత వర్ణం వల్లే సెరెనా తనపై ద్వేషభావం పెంచుకుందని చెప్పుకొచ్చింది. గత 13 ఏళ్లుగా ఈ శత్రుత్వం కొనసాగుతోందని షరపోవా చెప్పింది. సెరెనాను ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తాను ఓడించడం, ఆ ఓటమి బాధతో ఆ నల్లకలువ లాకర్‌ రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్వడాన్ని తన ఆటోబయోగ్రఫీ షరపోవా వివరించింది. 
 
ఇంకా చెప్పాలంటే తన భారీ, బలమైన శరీరంతోనే ఆమె తనను భయపెట్టేసేదని షరపోవా ఆ పుస్తకంలో రాసింది. అయితే షరపోవా మాటలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపించాయి. 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన సెరెనాతో 5 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన షరపోవాకు అసలు పోలికే లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shares Newborn Pregnancy Journey Tennis Grandslam Serena Williams Maria Sharapova

Loading comments ...

ఇతర క్రీడలు

news

యుఎస్ ఓపెన్ విజేత స్పెయిన్ బుల్... కెరీర్‌లో 74 సింగిల్స్‌ టైటిల్‌

క్లే కోర్టు రారాజుగా పేరొందిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌‌ ...

news

చిన్న పురుగును చూసి వణికిపోయిన టెన్నిస్ క్రీడాకారిణి... వీడియో వైరల్

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో మహిళా సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి, ...

news

ఫెడెక్స్‌పై నీళ్లు చల్లిన అర్జెంటీనా స్టార్ అటగాడు...

అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో సంచలనం సృష్టించాడు. ఏకంగా ...

news

సంప్రదాయ దుస్తులతో రెజ్లింగ్ రింగ్‌లోకి.. కవితపై ప్రశంసలు (Video)

భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ ...

Widgets Magazine