Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సింధు అలా ప్రవర్తించిందా.. ఎల్లోకార్డు కూడా చూపించారు.. నెట్టింట్లో చర్చ..

మంగళవారం, 29 ఆగస్టు 2017 (10:15 IST)

Widgets Magazine

గ్లాస్గోలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాతో హోరాహోరీగా జరిగిన పోరులో సింధు ఓడిపోయినా రజతంతో తిరుగుముఖం పట్టింది. కానీ ఈ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రవర్తన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
మైదానంలో సింధు ప్రవర్తన సరిగా లేకపోవడం, బ్యాడ్మింటన్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో అంపైర్ సింధుకు ఎల్లోకార్డు చూపించారు. ప్రత్యర్థి కోర్టులోకి రాకెట్‌ను విసరడంతో పాటు అంపైర్ అనుమతి లేకుండా మైదానం నుంచి బయటికి పోవడం.. మ్యాచ్‌ను ఆలస్యం చేయడం వంటి ఆరోపణలపై ఆమెకు ఎల్లోకార్డు చూపించారు. ప్రస్తుతం సింధుకు ఎల్లోకార్డుపై ట్విట్టర్ మోతెక్కిపోతోంది. ఇలాంటివి పట్టించుకోకుండా సింధు ముందుకెళ్లాలని కొందరు, అంపైర్ ఎవరో స్కూల్ టీచర్‌లా ఉన్నాడని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
 
కాగా.. వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో పీవీ సింధు పోరాడి ఓడిపోయింది. జపాన్‌ ప్లేయర్‌ ఒకుహర చేతిలో 19-21, 22-20, 20-22 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. దీంతో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

చైనాలో పీవీ సింధు అదుర్స్.. ఫైనల్లోకి ఎంట్రీ.. సైనా నెహ్వాల్ అవుట్..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరి.. రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రికార్డు ...

news

నేను రియోకు వెళ్ళకుండా వుండాల్సింది.. సైనా సెన్సేషనల్ కామెంట్స్

మోకాలి గాయాల కారణంగానే రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుచలేకపోయానని.. ఇప్పటికే తన ...

news

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో సైనా-సింధు తలపడతారా?

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. స్థానిక ...

news

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ప్రీ-క్వార్టర్స్‌లోకి పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ ...

Widgets Magazine