Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)

Widgets Magazine
dead body

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియాన్ని 1978 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యే ఆ రాష్ట్ర క్రీడాకారులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అదేసమయంలో ఈ స్టేడియంలో వర్షపు వెళ్లేందుకు సరైన వసతులు లేవు. 
 
అయితే, తాజాగా భారీవర్షం కురవడంతో స్టేడియంలో వర్షం నీరు నిలిచింది. అదేసమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయం తెలియని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ స్టేడియంలోకి రోజువారీగా ప్రాక్టీస్ చేసేందుకు రాగా, విద్యుదాఘాతానికి గురై అపస్మారకంగా పడిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్ కుమార్ వర్మను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలానాథ్ సింగ్ తెలిపారు.
 
విశాల్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ భాలోనాథ్ సింగ్ చెప్పారు. అలాగే, కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

రింగ్‌లో డ్రాగన్ కోరలు పీకేసిన విజేందర్ : ఇండో-చైనా బోర్డర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపు

భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ కోరలు పీకేశాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ...

news

విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?

భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ...

news

డోప్ పరీక్షలో పట్టుబడిన భారతీయ అథ్లెట్ ... స్వర్ణం వెనుకకు?

భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా ...

Widgets Magazine