Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీరామనవమి రోజున 12 గంటలకు ఎందుకు పూజ చేయాలి?

బుధవారం, 13 ఏప్రియల్ 2016 (18:10 IST)

Widgets Magazine

రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి.
 
శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి  వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.
 
శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. అందుచేత శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారమవుతాం. అంతేగాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీరామ నవమి పూజ ఎలా చేయాలి?

శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ...

news

హనుమంతునిచే రాముడి వర్ణన : రాముడిని తప్ప మరే పురుషుడిని స్పృశించను..!

అశోక వనములో సీతాదేవిని గాంచిన హనుమంతుడు రాముడిని ఈ విధంగా వర్ణించాడు. ''రాముని కండ్లు ...

news

గంటలోనే శ్రీవారి దర్శనం..

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న దర్శనభాగ్యం శ్రీవారి భక్తులకు గంటలోనే లభిస్తోంది. ...

news

త్రయంబకేశ్వరంలో పురుషుల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత!

మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్రఖ్యాత త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి పురుషులు కూడా ...

Widgets Magazine