Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీ కృష్ణుడు వెన్న దొంగగా లోకానికి ఎలాంటి సందేశమిచ్చాడు..?

శనివారం, 5 సెప్టెంబరు 2015 (15:17 IST)

Widgets Magazine

జయతు జయతు దేవో దేవకీ నందనోయం 
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః |
తా.. ఓ దేవకీనందనా! ఓ వృష్టివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
 
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆ పరమాత్మను స్మరించుకుని... మువ్వల గోపాలుడు వెన్న దొంగగా ముద్ర వేసుకుని.. తద్వారా లోకానికి ఎలాంటి సందేశం చెప్పాడనేది తెలుసుకుందాం.. బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.
 
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
 
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. 
 
ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైనదని చెప్తారు. దుష్ట శిక్షణ కోసం భూమిపై మానవుడిగా పుట్టిన కృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీకృష్ణాష్టమి రోజున ఆ శ్లోకాన్ని స్మరిస్తే..

భగవద్గీత సమస్త ఉపనిషత్తుల సారం. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు భగవద్గీతలో ...

news

శ్రీకృష్ణాష్టమి వ్రతం ఆచరిస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా?

శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే గోకులాష్టమి, జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగను శ్రావణ ...

news

శ్రీకృష్ణాష్టమి: సన్నజాజులతో పూలమాల, పసుపు రంగు అక్షింతలు సిద్ధం చేసుకోండి..

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ ...

news

గణపతి దేవా...! నీ నిమజ్జనానికి నీళ్ళేవి..?

వర్షంలేదు. ఎక్కడా నీళ్ళు లేవు.. చెరువులు ఎండిపోయాయి. నా చవితెప్పుడో చప్పవయ్యా అంటూ గణపతి ...

Widgets Magazine