బావా కంగ్రాట్స్... నీకు ఒక లక్ష మెజారిటీ రాబోతోంది...(Video)

Harish Rao-KTR
Last Modified శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:44 IST)
మంత్రి హరీశ్ రావు - కేటీఆర్ ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. అసలే ఎన్నికలు జరుగుతున్నాయాయే... హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్న కేటీఆర్, అదేవిధంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళిని తెలుసుకుంటు గ్రామాలు తిరిగి వస్తుండగా గుర్రాలగొంది గ్రామం వద్ద ఇద్దరూ కార్లలో ఎదురుపడ్డారు.

దాంతో మంత్రి కేటీఆర్, హరీష్ రావు కారు దిగారు.. కలుసుకున్నారు... మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా బావా కంగ్రాట్స్... నీకు లక్ష మెజార్టీ ఖాయం... నీ దాంట్లో సగమన్నా తెచ్చుకుంట... అని సిరిసిల్ల పోతున్న అని ఆత్మీయంగా కలిసిమాట్లాడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...దీనిపై మరింత చదవండి :